Pensions with bogus certificates : ఇకపై బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందే వారికి చెక్ పెట్టాలని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ అదేవిధంగా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అయితే వీటిని దురుపయోగం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి స్వామి పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లను పొందుతున్నారో వారిని వెంటనే గమనించి పింఛన్లను కట్ చేస్తామని, అలాగే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఒక ప్రణాళికను సైతం రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్వామి పేర్కొన్నారు.
ఇప్పటికే ఇందులో భాగంగా వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు ఇలా సమాజంలో నిస్సహాయులైన వారందరికీ తమ ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో సంక్షేమం పక్కదారి పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎవరైనా బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పొందుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని కూడా ఆయన ప్రజలకు సూచించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు చేరుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Gold-Silver Rates: హమ్మయ్య.. మొత్తానికి బంగారం ధర తగ్గిందోచ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. పలు రకాల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4 వేలకు పెంచగా, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు సైతం పింఛన్ రూ.4 వేలకు పెంచింది. ఇక దివ్యాంగుల పెన్షన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read : Monthly Income: ప్రతినెలా వడ్డీ రూపంలో ఆదాయం కావాలా? అయితే ఈ టాప్ -3 స్కీమ్స్ గురించి ఓ సారి తెలుసుకోండి
పూర్తిగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధుల సమీకరణ జరుగుతోంది.. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పక్కదారి పట్టకుండా ఉండాలంటే కచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఈ పెన్షన్లు అందాలని మంత్రి స్వామి పేర్కొంటున్నారు. త్వరలోనే అనర్హులను గుర్తిస్తూ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి