ఏపీలో తొలిసారిగా "ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటు" ఏర్పాటు

భారతదేశంలోనే తొలిసారిగా.. అందులోనూ ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : Jul 15, 2018, 05:21 PM IST
ఏపీలో తొలిసారిగా "ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటు" ఏర్పాటు

భారతదేశంలోనే తొలిసారిగా.. అందులోనూ ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘ఎక్స్‌పర్ట్ 365’ సంస్థ సహకారంతో పైలెట్ ప్రాజెక్టుగా ఈనెల 18న గుంటూరు, విజయవాడ రైతు బజార్లలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ప్లాంటులో బజార్లలోని కూరగాయల వ్యర్థాలను కేవలం 31 గంటల్లోనే కంపోస్టుగా తయారుచేస్తారు. అలాగే ఒక్కో ప్లాంటుకు వారానికి రెండు టన్నుల వ్యర్ధాలను కంపోస్టుగా మార్చే సామర్థ్యం ఉంటుంది. అలాగే 300 కేజీల పళ్లు, కూరగాయలు ఇతర వ్యర్ధాలతో 50 కేజీల వరకు సేంద్రీయ ఎరువు తయారవుతుంది. ఈ విధంగా తయారైన  ‘ఆర్గానిక్ కంపోస్ట్’ను ‘చంద్రన్న రైతు సమృద్ధి’ పేరుతో తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఈ ప్లాంట్లనే ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లని కూడా అంటారు. ఇటీవలే ఈ ప్లాంటుల ఏర్పాటు గురించి లోతుగా చర్చించేందుకు సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్లాంటులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 

Trending News