CM Jagan Mohan Reddy: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి అకౌంట్లలో రేపే డబ్బులు జమ

EBC Nestham Scheme Founds: ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు రేపు అకౌంట్‌లో డబ్బులు జమకానున్నాయి. బుధవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేలు జమకానున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నేరుగా అకౌంట్‌లో జమ చేయనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 07:10 PM IST
CM Jagan Mohan Reddy: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి అకౌంట్లలో రేపే డబ్బులు జమ

EBC Nestham Scheme Founds: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని బుధవారం విడుదల చేయనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.  వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లలో  రూ.30 వేలు ఆర్ధిక సాయం చేసింది జగన్ సర్కారు.

బుధవారం అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లుగా ఉంది. ఒక్కో మహిళ ఖాతాలో ఇప్పటివరకు రూ.30 వేలు జమ చేసింది. వివిధ పథకాల ద్వారా మహిళలకు గత 46 నెలల్లో రూ.2,25,991.94 కోట్లు లబ్ధి అందించింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వాలంటీర్‌ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే.. వీరిలో 1.33 లక్షల మంది మహిళలే ఉన్నారు. 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే కేటాయించారని ఆ పార్టీల నేతలు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం, నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌లుగా 51 శాతం, డైరెక్టర్, మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్‌పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు మహిళలకే కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ

సీఎం పర్యటన వివరాలు ఇలా..

==> బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు

==> ఉదయం 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు

==> ఉదయం 10.15 గంటల నుంచి 12.05 మధ్య ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు.. అనంతరం బహిరంగ సభ వేదికపై ప్రసంగం

==> కార్యక్రమం ముగిసిన అనంతరం 12.40 గంటలకు నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Also Read: Salman Khan New Car: సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News