Sagaramala Project: ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం మరింతగా అభివృద్ధి చెందనుంది. సాగరమాల పథకం కింద రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు వస్తున్నాయని కేంద్రమంత్రి శర్బానంద్ వెల్లడించారు. ఆ వివరాలు ఇవే..
దేశంలో అత్యంత పొడవైన సముద్రతీరం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో తీరప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలున్నాయి. ముఖ్యంగా జల రవాణాను హైలైట్ చేయవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పోర్టులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సాగరమాల పథకం కింద రాష్ట్రానికి 12 ప్రాజెక్టులకు ప్రతిపాదనలున్నట్టు కేంద్ర పోర్టులు , షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు
విశాఖపట్నం పోర్టు రూపొందించిన 12 ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందినట్టు మంత్రి స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సాగరమాల పథకం కింద ఈ ఆర్ధిక సంవత్సరానికి 412 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో కోట్లు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. ఈ నిధుల్ని సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టే మేజర్ పోర్టులు నాన్ మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్ బోర్డులకు కేటాయిస్తారు. ప్రాజెక్టు పనిని బట్టి మూడు దశలుగా నిధులు విడుదలవుతాయి.
ఇప్పటికే ఏపీలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 5 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ , కోస్తా జిల్లాల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పనులు జరుగుతున్నాయి. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిఖ సదుపాయాల్ని కల్పిస్తున్నారు. భీమునిపట్నం, కళింగపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం జరుగుతోంది.
Also read: Ysr Congress Party: నారా లోకేష్‌పై సెటైరికల్ పంచ్‌లు విసిరిన విజయసాయి రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook