జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు సీరియస్.. సీఎం తరుపు న్యాయవాదికి హెచ్చరిక

YS Jagan illegal assets case: సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు (Telangana High court) సీరియస్‌గా స్పందించింది. జగన్ తరుపు న్యాయవాది చేసిన అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 10:15 AM IST
  • తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
    విచారణ ఒకరోజు వాయిదా వేయాలన్న జగన్ తరుపు న్యాయవాది
    అలాగైతే రోజుకు రూ.50వేలు చెల్లించాలని కోర్టు హెచ్చరిక
జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు సీరియస్.. సీఎం తరుపు న్యాయవాదికి హెచ్చరిక

YS Jagan illegal assets case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High court) కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు హాజరయ్యే విషయంలో జగన్‌కు మినహాయింపునివ్వాలనే పిటిషన్‌పై విచారణను ఒకరోజు వాయిదా వేయాల్సిందిగా ఆయన తరుపు న్యాయవాది కోరారు. దీనిపై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది హాజరుకావాల్సి ఉందని... కాబట్టి విచారణను ఒకరోజు వాయిదా వేయాలని అభ్యర్థించారు. న్యాయస్థానం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నెల 16న న్యాయవాదుల అంగీకారంతోనే విచారణ చేపట్టామని హైకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ గుర్తుచేశారు. తీరా ఇప్పుడు ఏదో ఒక సాకుతో విచారణ వాయిదా వేయాలని కోరడం సబబు కాదన్నారు. కేసులు విచారణకు వచ్చినప్పుడు వాదనలు వినిపించాల్సిందేనని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఖర్చుల కింద రోజుకు రూ.50వేలు చొప్పున హైకోర్టు (High court) న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also Read: 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ

అంతకుముందు, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా సైతం విచారణకు కొంత గడువు కావాలని కోరారు. వివాహం కారణంగా విచారణ వాయిదా వేయాలని ఆయన తరుపు న్యాయవాది న్యాయమూర్తిని అభ్యర్థించారు. న్యాయస్థానం దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో విచారణ వాయిదా వేయాలని కోరడమేంటని ప్రశ్నించింది. ఆ తర్వాత, వాన్‌పిక్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐఆర్ఎస్ మాజీ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు (High court) ఈ నెల 22కు విచారణను వాయిదా వేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News