Manchu Vishnu fun with Sunny Leone: 'మోసగాళ్లు' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన కొత్త సినిమా 'గాలి నాగేశ్వరరావు' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇందులో లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా... షూటింగ్ గ్యాప్‌లో విష్ణు, సన్నీ లియోన్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సన్నీ లియోన్ ముఖానికి మాస్క్ తగిలించుకుని ఓ గోడ చాటున నిలబడి ఉండగా... వెనుక నుంచి మంచు విష్ణు వస్తాడు... ఇంతలో గోడ చాటు నుంచి బయటకొచ్చిన సన్నీ లియోన్ విష్ణుని భయపెట్టేందుకు గట్టిగా అరుస్తుంది.. సన్నీ అరుపులకు భయపడని విష్ణు... ఆమె తన ముఖానికి మాస్క్ తీయగానే భయంతో గట్టిగా అరిచేస్తాడు... దీంతో సన్నీ లియోన్ సరదాగా విష్ణు వెంట పడి తరుముతుంది. విష్ణుతో కలిసి చేసిన ఈ ఇన్‌స్టా రీల్స్ వీడియోను సన్నీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో అల్లు అర్జున్ పుష్ప సాంగ్ 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి' పాట ప్లే అవుతోంది.
ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు సెటైర్స్ సంధిస్తున్నారు. 'లెట్ దెమ్ ఎంజాయ్ అంకుల్... లెట్ దెమ్ ఎంజాయ్...' అంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. మరో నెటిజన్... 'మా విష్ణు అన్న రేంజ్ అంటే అది మరీ...' అని కామెంట్ చేయగా... 'మా అన్నకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు...' అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
కాగా, సన్నీ లియోన్ గతంలో హీరో, మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ సినిమా 'కరెంట్ తీగ'లో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న 'గాలి నాగేశ్వరరావు' సినిమాలో ఆమె రేణుక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో అవ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: RGV: రామ్ గోపాల్ వర్మని ముద్దుల్లో ముంచెత్తిన ప్రముఖ హీరోయిన్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook