Ravi Teja - Eagle: రవితేజ 'ఈగిల్' మూవీ మేకింగ్ వీడియో విడుదల.. అదిరిపోయిన విజువల్స్..

Ravi Teja - Eagle: రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీ మేకింగ్ విజువల్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2024, 07:11 PM IST
Ravi Teja - Eagle: రవితేజ 'ఈగిల్' మూవీ మేకింగ్ వీడియో విడుదల.. అదిరిపోయిన విజువల్స్..

Ravi Teja - Eagle: మాస్ మహారాజ్ రవితేజ.. గతేడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య హిట్టైనా.. క్రెడిట్ మాత్రం రవితేజకు దక్కలేదు. అంతా చిరు ఖాతాలోకే వెళ్లింది. ప్రెజెంట్ ఈయన ఈగిల్ మూవీతో పలకరించబోతున్నాడు. సంక్రాంతి రేసులో విడుదల కావాల్సిన ఈ మూవీ థియేటర్స్ తీవ్ర పోటీ కారణంగా ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయినా విడుదల విషయంలో ఒక అడుగు వెనకడుగు వేసినా.. ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇక సంక్రాంతి బరిలో మహేష్ బాబు 'గుంటూరు కారం', హనుమాన్ మూవీలు జనవరి 12న విడుదలయ్యాయి. ఇక జనవరి 13న ఈగిల్ మూవీ విడుదల కావాల్సి ఉన్న నిర్మాతల మండలి జోక్యంతో ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే విడదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేసారు మేకర్స్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మూవీలో రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని రచనతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ చేసారు. సంగీతం దావ్జాంద్ అందిస్తున్నారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్‌' మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Also read: AP Assembly Budget Session 2024: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నిరోజులంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News