Mahesh Babu: మహేశ్ బాబు ఇంకా టాప్ 50 జాబితాలో ఎందుకు లేడు, ఆ ఫీట్ సాధించలేడా

Mahesh Babu: టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా, భారీ ఫాలోయింగ్ ఉన్న హ్యాండ్‌సమ్ నటుడిగా పేరున్న మహేశ్ బాబు ఇంకా ఆ ఫీట్ సాధించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ బాబు ఇప్పటికీ టాప్ 50 జాబితాలో ఎందుకు లేడనేది ప్రశ్నార్ధకంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2023, 01:41 PM IST
Mahesh Babu: మహేశ్ బాబు ఇంకా టాప్ 50 జాబితాలో ఎందుకు లేడు, ఆ ఫీట్ సాధించలేడా

Mahesh Babu: పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా అన్నీ సూపర్ డూపర్ హిట్లే. తెలుగు నటుల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఎందుకో ఇప్పటికీ టాప్ 50 జాబితాలో చేరలేకపోయాడు. ఎంటీ జాబితా, కారణాలేంటనేది తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నటుల్లో ఒకడిగా, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హ్యాండ్‌సమ్ హీరోగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్థానం ప్రత్యేకం. 48 ఏళ్ల మహేశ్ బాబు ఇప్పటికీ అత్యధిక వసూళ్లు జరిపిన టాప్ 50 భారతీయ సినిమాల్లో చోటు సంపాదించలేకపోయాడు. ఇంత పెద్ద నటుడైనా అతని ఏ సినిమా వసూళ్ల పరంగా టాప్ 50కు చేరకపోవడం గమనార్హం. అదే సమయంలో అతని సహ నటులు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఈ ఫీట్ సాధించడమే కాకుండా పాన్ ఇండియా నటులుగా ఉన్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే చిన్న నటుడు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన రిషభ్ శెట్టి సైతం కాంతారా సినిమాతో టాప్ 50 జాబితాలో చేరిపోయాడు. 

మరో శాండల్‌వుడ్ నటుడు యశ్ సైతం దక్షిణాదిన తనదైన మార్క్ చూపించాడు కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు జరిపి భారతీయ సినిమాల్లో నాలుగో స్థానం సాధించాడు. ఇప్పటికీ సినీ పరిశ్రమలో పాతుకుపోయిన సీనియర్ నటులు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్ సైతం టాప్ 50 జాబితాలో కొనసాగుతున్నారు. 

కానీ తెలుగు సినీ పరిశ్రమలో లాంగ్ స్టాండింగ్, అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ నటుడిగా సూపర్ డూపర్ హిట్స్ కలిగి ఉన్న మహేశ్ బాబు మాత్రం ఈ జాబితాలో చేరలేకపోయాడు. రానున్న నూతన సంవత్సరం 2024లో సంక్రాంతికి విడుదల కానున్న మహేశ్ బాబు తాజా చిత్రం గుంటూరు కారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలో తెరకెక్కనున్న రాజమౌళి చిత్రంతో మహేశ్ బాబు కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించే టాప్ 10 లేదా టాప్ 5 భారతీయ సినిమాల జాబితాలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజమౌళి సినిమా విడుదలయ్యేనాటికి మహేశ్ బాబు 50 వడిలో చేరనున్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌‌గా పేరు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 

Also read: Kalyan Ram Comments: ఫ్యామిలీ అంటే మేమిద్దరమే, వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News