Vennela Kishore As Hero: ఒకప్పుడు బ్రహ్మానందం ని చూస్తే ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడేవారు.. దాదాపు అంతలా ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నారు వెన్నెల కిషోర్. సినిమా స్క్రీన్ పై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో తెలియకుండానే నవ్వొస్తుంది. అలా తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఒసేయ్ అరుంధతి అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు.
వెన్నెల కిషోర్, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’.. ఈ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రదక్షణ వర్క్స్ శెరవేగంగా జరుపుకుంటుంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, కమల్ కామరాజు తో పాటు మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుంది. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా మీడియా సమావేశం జరపగా ఈ సమావేశంలో ఈ సినిమా నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అని తెలియజేశారు.
ఇక ఆ తరువాత ఈ సినిమా విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది అరుంధతి. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పుకొచ్చాడు.
వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు తో పాటు ఈ సినిమాలో పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు
Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter