బీహార్ ఎన్నికల ( Bihar Elections ) ఫలితాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదంటూ కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీహార్ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీ ( Congress party ) సీనియర్ నేతల్లో అంతర్మధనం ఎక్కువైెంది. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేత కపిల్ సిబల్ ( kapil sibal ) తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. పార్టీ పునరుత్తేజానికి అనుభవంతో కూడిన ఆలోచన చేస్తూ..వాస్తవ పరిస్థితుల్ని అర్దం చేసుకునే వ్యక్తి అవసరమని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదంటూ సంచలనం రేపారు. ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవల్సిన అవసరం వచ్చిందన్నారు. బీహార్ తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిని పరిశీలించాలన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలివైనదని..ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది తప్పకుండా గుర్తిస్తుందన్నారు.
2019 ఆగస్టు నెలలో పార్టీ అధి నాయకత్వం ( Congress High command )పై అసమ్మతి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఒకరు. ఇప్పటికీ పార్టీ తమ అభిప్రాయాలు తీసుకోడానికి ప్రయత్నం చేయడం లేదని..పైగా తమను నియంత్రించిందని ఆరోపించారు. ఇప్పటికైనా సరే నాయకత్వ మార్పు చేసి దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేయాలని సూచించారు. అనుభవమున్నవారిని ప్రోత్సహించి..వారి అభిప్రాయాల్ని పరిగణలో తీసుకోవాలన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిని సాధారణంగా భావిస్తుండటం, అంతా బాగానే ఉన్నట్టు అనుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పారు. Also read: Snowfall: కేదార్ నాథ్ లో భారీగా హిమపాతం, చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు