Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్

Monkey Fools Tiger: అడవిలో పులిని చూస్తే మనుషులే కాదు.. జంతువులైనా హడలెత్తిపోవాల్సిందే. ప్రాణాలు దక్కించుకునేందుకు దూరంగా పరుగెత్తాల్సిందే. కానీ కోతులు మాత్రం అలా కాదు. ఒక కోతి, ఒక పులి ఒక్క చోట చేరితే అక్కడ కామెడీ సీన్ పండాల్సిందే.

Written by - Pavan | Last Updated : Sep 30, 2022, 11:15 PM IST
Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్

Monkey Fools Tiger, Watch: అడవిలో పులిని చూస్తే మనుషులే కాదు.. జంతువులైనా హడలెత్తిపోవాల్సిందే. ప్రాణాలు దక్కించుకునేందుకు దూరంగా పరుగెత్తాల్సిందే. కానీ కోతులు మాత్రం అలా కాదు. ఒక కోతి, ఒక పులి ఒక్క చోట చేరితే అక్కడ కామెడీ సీన్ పండాల్సిందే. ఎందుకంటే కోతులు ఎవరితోనైనా కోతి వేషాలే వేస్తాయి. అందుకే తిక్క వేషాలు వేసే వాళ్లను కూడా కోతి వేషాలు వేస్తున్నాడని కోతితో పోలుస్తారు. ఇదిగో ఈ వీడియో చూస్తే ఇదంతా ఎందుకు చెబుతున్నట్టో మీకే అర్థమవుతుంది.

అడవిలో ఆహారాన్ని వేటాడుకుంటూ వెళ్లిన పులికి చెట్టు మీద కోతి కనిపించింది. అబ్బా.. ఏం చక్కా ఈ పూటకు ఈ కోతితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టుగా హడావుడిగా వెళ్లి చెట్టెక్కి కోతి దగ్గరకు వెళ్లబోయింది. కోతి చంకలో పిల్ల కోతి కూడా ఉంది. మాములుగానే కోతి చాలా అలర్ట్ గా ఉంటుంది. ఎవ్వరినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తుంది. మరి చంకలో పిల్ల ఉన్నప్పుడు ఆ కోతి ఇంకెంత అప్రమత్తంగా ఉంటుంది చెప్పండి!! అందుకే పులికి దొరక్కుండా చిటారు కొమ్మపైకి వెళ్లి కూర్చుంది. అయినాసరే పట్టువదలని పులిమార్కుడిలా అడుగులో అడుగు వేసుకుంటూ కోతి దగ్గరి వరకు వెళ్లింది. ఒక్క దూకుడు దూకితే కోతిని నోట చిక్కించుకోవచ్చనే కాన్ఫిడెన్స్ పులి ముఖంలో కనిపిస్తుంటే.. ఎలా వస్తావా రా.. నీ అంతు చూస్తానన్న వెకిలి నవ్వు కోతిది. 

పులి చిన్నగా కోతిని సమీపిస్తున్న కొద్దీ ఆ సీన్ సస్పెన్స్ డ్రామాను తలపించింది. పులి ఇక కోతి మీదకు దూకుతుందనుకుంటున్న క్షణంలోనే సీన్ రివర్స్ అయింది. కోతిని పట్టుకునేందుకు పులిని ఒక్క అడుగు ముందుకేయగా.. అదే సమయంలో అక్కడి నుండి మరో కొమ్మపైకి అన్నట్టుగా కోతి కొంచెం పక్కకు జరిగింది. అంతే.. పట్టు కోల్పోయిన పులి చెట్టు కొమ్మపై నుంచి వేళ్లాడుతూ కిందపడిపోయింది. అర్రె.. జస్ట్ మిస్ అయ్యావురా.. లేకుంటేనా అన్న డిజప్పాయింట్‌మెంట్ పులి ముఖంలో స్పష్టంగా కనిపించింది. కోతి మాత్రం తెలివిగా సేఫ్ గేమ్ ఆడి పులి బారి నుంచి బయటపడింది. చూడ్డానికి కామెడి సీన్ లా కనిపిస్తున్నా..  ధైర్యంగా పోరాడితే.. ఆ ధైర్యానికి ఇంకొంత తెలివి జోడిస్తే.. అవతలి శత్రువు ఎంత బలమైన వాడైనా గెలవడం పక్కా అనే సందేశాన్నించింది ఈ వీడియో. అడవిలో సఫారి రైడ్‌కి వెళ్లిన వారి కంటికి కనిపించిన ఈ సీన్‌ని తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కోతి, పులి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Snake Water Viral Video: పాము నీరు తాగడం ఎప్పుడైనా చూశారా?.. ఈ వీడియో చూడండి మరి! సెకన్లలో గ్లాసులోని నీరు ఖాళీ

Also Read : Banana Snake: ఇది అరటి పండు కాదు..భయంకరమైన పాము

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News