You will become Rich if you see a lizard in this place in your house: భవిష్యత్తులో జరిగే సంఘటనల సంకేతాలు మన దైనందిన జీవితంలో ముందే కనిపిస్తాయి. ఈ సంకేతాలు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మరియు శకున్ శాస్త్రంలో స్పష్టంగా వివరించబడింది. ఇంట్లోకి తరచుగా చీమలు, ఎలుకలు, బల్లులు, బొద్దింకలు, పిల్లులు, పాములు, గబ్బిలాలు లాంటి చిన్నచిన్న జీవులు వస్తుంటాయి. ఇంట్లోకి తరచుగా వచ్చే ఈ జీవులు.. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ముందే సూచనలను ఇస్తాయి. వీటిని చాలామంది నమ్ముతారు కూడా.
ఇంట్లో ఉండే బల్లుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో నిత్యం తిరిగే బల్లులు మనిషి శరీరంపై పడితే.. అశుభంగా పరిగణిస్తారు. శరీరంపై పడితే వెంటనే తల స్నానం చేసి.. బల్లి బొమ్మను తాకి, మొక్కుతారు. ఇక మనిషి శరీరంలోని కొన్ని భాగాల్లో పడితే పెద్ద కీడుగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో బల్లి ఏ ప్రదేశంలో ఉంటే శుభమో లేదా అశుభమో కూడా జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. బల్లికి సంబంధించిన సంకేతాలు ఓసారి తెలుసుకుందాం.
కొత్త ఇంట్లో చనిపోయిన బల్లి:
మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వ్యాపార సంస్థ ఆరంభిస్తున్నట్లయితే.. అక్కడ చనిపోయిన బల్లి కనిపిస్తే అశుభమే అని చెప్పాలి. ఇది ఇంటి సభ్యుని అనారోగ్యం లేదా డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో నిబంధనల ప్రకారం పూజలు చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి వెళ్లండి. అప్పుడే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
పూజ గదిలో బల్లి:
ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది శుభ సంకేతం. బల్లి లక్ష్మిదేవికి సంబంధించినది. కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మిదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. త్వరలోనే అధిక డబ్బు పొందుతారు. అంతేకాదు మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
3 బల్లులను కలిపి చూడటం:
ఇంట్లో 3 బల్లులు కలిసి కనిపిస్తే.. అది శుభసూచకం అని జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సుకు ఇది సంకేతం.
రెండు బల్లులు పోట్లాడుకోవడం:
ఇంట్లో, ఆఫీసు లేదా వ్యాపారంలో రెండు బల్లులు పోట్లాడుకోవడం అశుభం. మీ జీవితంలో ప్రమాదం రాబోతుందని లేదా వివాదంలో చిక్కుకోబోతున్నారని సూచిస్తుంది. రెండు బల్లులు పోట్లాడుకోవడం ఇంట్లోని సభ్యుల ఆరోగ్యంపై ప్రబావం చూపుతుంది. ఇలా జరిగినప్పుడు ఎవరితోనూ గొడవలు, వివాదాలకు పోకూడదు.
Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం! రిషబ్ పంత్ పని అయిపోయింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.