Rama Ekadashi 2022 Puja Vidhi: ఈరోజు కార్తీక మాసంలోని రామ ఏకాదశి. రామ ఏకాదశి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్య కలిగి ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున ఈ రామ ఏకాదశిని (Rama Ekadashi 2022) జరుపుకుంటారు. అయితే భక్తులంతా ఈ రోజు శ్రీమహావిష్ణువును నియమానుసారంగా పూజించి వ్రత కథ వింటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో విష్ణువుని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా రామ ఏకాదశి ఉపవాసాలు పాటించిన వారు కథను తప్పకుండా వినాల్సి ఉంటుంది.
ఇలా పూజా కార్యాక్రమాలు చేయడం వల్ల పుణ్యం లభించడమేకాకుండా పాపాలు తొలగిపోతాయి. అయితే ఈ పూజలు చేసే క్రమంలో తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. రామ ఏకాదశి వ్రతానికి సంబంధించిన శుభ సమయం, పూజా విధానం, పారణ సమయం తెలుసుకుందాం..
రామ ఏకాదశి 2022:
కార్తీక కృష్ణ ఏకాదశి తిథి ముహూర్త ప్రారంభం: అక్టోబర్ 20(నిన్నటి నుంచి), గురువారం, 04:04 PM
కార్తీక కృష్ణ ఏకాదశి తిథి ముగుస్తుంది: ఈరోజు, శుక్రవారం, సాయంత్రం 05:22
శుక్ల యోగం: ఈరోజు ఉదయం నుంచి 05:48 వరకు
బ్రహ్మయోగం: ఈరోజు సాయంత్రం 48 గంటలకు
రామ ఏకాదశి పూజ ముహూర్తం ఈ రోజు ఉదయం 07:50 వరకు..
రామ ఏకాదశి 2022 పూజ మంత్రం:
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
రామ ఏకాదశి వ్రతం, ఆరాధన విధానం:
1. ఈ ఉదయం స్నానం చేసిన తరువాత.. పసుపు రంగు వర్ణం దుస్తులు ధరించి.. రామ ఏకాదశి ఉపవాసం, విష్ణుపూజ వ్రతం చేయండి. ఆ తర్వాత శుభ సమయంలో విష్ణువును పూజించండి.
2. శుభముహూర్తంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంచామృతంతో విగ్రహాలకు అభిశేకం చేయాల్సి ఉంటుంది. తర్వాత వారికి వస్త్రాలు, చందనం, పసుపు పుష్పాలు, మాల, తులసి ఆకులు, పంచామృతం, అక్షతం, తమలపాకులు, తమలపాకులు, ధూపం, పసుపు, దీపం మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది.
3. ఆ తర్వాత విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం, రామ ఏకాదశి ఉపవాస కథను పఠించాలి.
4. విష్ణువుకు నెయ్యి దీపంతో పూజించాలి.
5. రోజంతా పండ్లను ఆహారంలో ఉంటూ భక్తిగీతాల్లో గడపండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook