Vastu Tips: చాలామంది ఇళ్లలో పూర్వీకులు ఫోటోలు పెట్టుకుంటారు. అదొక జ్ఞాపకం..గౌరవ సూచకం. అయితే కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంట. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇళ్లలో పూర్వీకుల ఫోటోలు అమర్చుకునే విషయంలో కొన్ని నియమాలు లేదా సూచనలున్నాయి. ఒకవేళ ఆ విషయాల్ని పరిగణలో తీసుకోకపోతే..ఇంట్లో సుఖశాంతులు దూరమౌతాయి. దాంతోపాటు డబ్బు సంబంధిత ఇబ్బందులు ఎదురౌతాయి.
ఇంట్లో ఎవరైనా వ్యక్తి మరణానంతరం ఆ వ్యక్తి ఫోటో గోడకు తగిలిస్తుంటారు. ఇంట్లో పూర్వీకుల ఫోటోలు పెట్టడం వల్ల ఆ ఇంటికి, కుటుంబసభ్యులకు పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అయితే ఆ ఫోటోల్ని వాస్తుశాస్త్రం ప్రకారం పెడితేనే ఆశీర్వాదం లభిస్తుంది. అలాకాకుండా తప్పు ప్రదేశం లేదా తప్పు దిశలో ఫోటోలు పెడితే జీవితాంతం ఆ చెడు ప్రభావం ఉంటుందట. ఇంట్లో రాంగ్ డైరెక్షన్ లేదా రాంగ్ ప్లేస్‌లో పూర్వీకుల ఫోటోలు పెట్టడం వల్ల ఆ ఇంటి సుఖ సంతోషాలు దూరమౌతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోలు ఎలా పెట్టాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
వాస్తు పండితుల ప్రకారం..పూర్వీకులను ఎప్పుడూ గోడలకు వేలాడదీయకూడదు. ఆ ఫోటోల్ని ఫ్రేమ్ చేసి ఎక్కడైనా అ అమర్చాలి. పూర్వీకుల ఫోటోల్ని పొరపాటున కూడా బెడ్రూమ్, కిచెన్, డ్రాయింగ్ రూమ్‌లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది. దాంతోపాటు ధననష్టం సంభవించే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా...పూర్వీకులు అవమానం పాలవుతారట.
ఇంట్లోని పూజాస్థలం, లేదా దేవతలతో పాటు ఇంటి పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. పూర్వీకుల ఫోటోలతో పాటు మీ ఫోటోలు అస్సలు పెట్టకూడదు. లేకపోతే..ఇంట్లో కుటుంబసభ్యుల ఆయుష్షు తగ్గుతుంది. నెగెటివ్ శక్తి ప్రభావం పడుతుంది.
ఇంటి దక్షిణదిశ గోడపై పూర్వీకుల ఫోటో పెట్టడం అశుభంగా భావిస్తారు. ఒకవేళ ఆ ఫోటోల్ని ఇంటి ఉత్తర దిశలో పెడితే..జీవితంలో కష్టాలు, అకాల మృత్యువు భయం తగ్గుతుంది. పూర్వీకుల ఫోటోల్ని ఇంటి ఉత్తర దిశలో పెట్టడం వల్ల వారి చూపి దక్షిణంవైపుంటుంది. దక్షిణమనేది యమదిశగా చెబుతారు.
Also read: Numerology: ఆ తేదీల్లో పుట్టినోళ్లు అత్యంత తెలివైనవాళ్లంట, మీరు పుట్టింది ఎప్పుడు మరి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook