IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ?.. లైవ్‌ స్ట్రీమింగ్‌ డీటెయిల్స్ ఇవే!!

IPL 2022 Auction Dates and Venue: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 05:16 PM IST
  • ఐపీఎల్ 2022 వేలంలో 590 మంది ప్లేయర్స్
  • మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం
  • బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ?.. లైవ్‌ స్ట్రీమింగ్‌ డీటెయిల్స్ ఇవే!!

IPL 2022 Auction Venue, Dates and Timing details: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో కాసులు కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ఆరంభం కానుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఈసారి కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్ టోర్నీలో చేరడంతో మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఆక్షన్‌లో పాల్గొననున్నాయి.

మొత్తం 590 మంది ప్లేయర్స్ ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొననున్నారు. 590లో 370 మంది భారత క్రికెటర్లు కాగా.. మిగిలిన 220 మంది విదేశీ ప్లేయర్లు. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉండగా.. 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. దాదాపు 50 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లుగా ఉండగా.. 20 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లగా ఉంది. కోటిన్నర రూపాయల మార్జిన్‌లో 20, కోటి రూపాయల రిజర్వ్ ప్రైస్ కేటగిరీలో 34 మంది క్రికెటర్లు ఉన్నారు. చాలా మంది ఆటగాళ్ల ధరను కోటి కంటే తక్కువగా ఉంది. అందులో రూ.50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల బేస్ ధర ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. 

రెండు రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ 2022 మెగా వేలంను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అలానే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2022 లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. శనివారం ఉదయం 11 గంటలకు కవరేజ్ ఆరంభం కానుండగా.. 12 గంటలకు వేలం పాట మొదలవుతుంది. శనివారం, ఆదివారం వేలం ఉండనుంది. 

ఐపీఎల్ 2022 మెగా వేలం వివరాలు:
# IPL 2022 వేలం ఎప్పుడు జరుగుతుంది?
IPL 2022 వేలం ఫిబ్రవరి 12, 13 (శనివారం, ఆదివారం) జరుగుతుంది.

# IPL 2022 వేలం ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ 2022 వేలం బెంగళూరులో జరుగుతుంది.

#I PL 2022 వేలం ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
IPL 2022 వేలం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

# IPL 2022 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. 

Also Read: Chahal Pushpa Dialogue: 'తగ్గేదేలే' అన్న యుజ్వేంద్ర చహల్.. సెటైర్ వేసిన డేవిడ్ వార్నర్!!

Also Read: Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News