Auctioneer Hugh Edmeades collapsed mid auction due to Heart Attack: బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో అపశృతి చోటు చేసుకుంది. ఆక్షనర్ (వేలం నిర్వహించే వ్యక్తి) హగ్ హెడ్మెడెస్ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టేజ్ మీదే కుప్పకూలిపోయాడు. శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా కోసం బిడ్డింగ్ జరుగుతుండగా.. హెడ్మెడెస్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే అతడిని మెడికల్ సిబ్బంది వచ్చి పర్యవేక్షించారు.
వేలం పాట జరుగుతుండగా ఆక్షనర్ హగ్ హెడ్మెడెస్ ఉన్నట్టుండి కింద పడటానికి గల స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. అతడికి గుండెపోటు వచ్చిందని సమాచారం తెలుస్తోంది. అయితే హెడ్మెడెస్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని కెమెంటేటర్లు చెపుతున్నారు. ఆయనకు మెడికల్ స్టాఫ్ చికిత్స అందిస్తోందని ముంబైలోని ఓ కామెంటేటర్ చెప్పారు. వేలం తిరిగి 3.30కి ఆరంభం కానుంది. అయితే ఆక్షనర్‌గా హెడ్మెడెస్ వస్తాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
#IPLAuction eer #HughEdmeades has collapsed..
Hope he is safe.. pic.twitter.com/eTz9uh4PVV
— Ramesh Bala (@rameshlaus) February 12, 2022
భారత్ యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అన్ని ప్రాంఛైజీలు అతడి కోసం పోటీపడగా.. రూ.12.25 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టే కగిసో రబాడను రూ. 9.25 కోట్లకుజ కైవసం చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 8కోట్లకు రాజస్థాన్, ప్యాట్ కమిన్స్ ను రూ.7.25 కోట్లు కోల్‌కతా కొనుగోలు చేసింది.
Also Read: IPL Auction 2022 Jason Holder: భారీ ధర పలికిన జాసన్ హోల్డర్.. లక్నో జట్టులో అందరూ స్టార్లే!!
Also Read: IPL Mega Auction 2022: ట్రెంట్ బౌల్ట్‌కు రాజస్తాన్ భారీ ధర.. రిటైన్ చేసుకోలేకపోయిన ముంబై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook