AP PRC Issue: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ఏర్పడిన పీఆర్సీ వివాదం ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసి రేపు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పదవులపై రచ్చ సాగుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో పార్టీలోని కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
CM Jagan on Probation: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ తీపికబురు చెప్పారు. జూన్ 30 నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడాని ఆయన స్పష్టం చేశారు.
Chiranjeevi on AP Govt: సినిమా టికెట్ల విషయంలో అనవసరంగా ఎవరూ నోరు జారొద్దని మెగా స్టార్ చిరంజీవి సూచించారు. ఏపీ సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.
YSRCP Councillor complaints to CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలోని వైసీపీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ ను స్థానిక సీఐ వేధింపులకు గురవుతుంది. అందుకు సంబంధించిన వీడియో రికార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. సీఐ నుంచి తనకు రక్షణ కావాలని సీఎం జగన్ కు ఆమె ఓ వీడియో ద్వారా విన్నవించుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ముందు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీఆర్సీ పై జగన్ సర్కార్ ఎట్టకేలకు ప్రకటన (CM Jagan announced PRC) చేసింది. 23.29 శాతం ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్న సీఎం.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా రెండు, మూడు రోజుల ప్రకటన చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
YSR Pension Kanuka Hike: ఏపీలో పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యుస్ చెప్పింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తం పెంపును అమలు చేసింది. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
AP CM Jagan: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
Pawan Kalyan: వరద బాధితులకు తామున్నామనే భావన కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్రభుత్వం ఇసుక అమ్ముతామని ప్రకటలు ఇస్తుండటంపై మండిపడ్డారు.
Chandrababu comments on AP cm Jagan: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తి చేశారు.
YSR Aasara scheme second tranche financial assistance: ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ గత ఏడాది శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి రెండో విడతలో ఏపీ వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ చేయనున్నారు.
New CS For AP: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలంలో ఈనెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
AP Govt:మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్‌కు సమన్లు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.