YS Sharmila Will Join Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరికకు షర్మిల కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు ఆప్షన్లు షర్మిల ముందు ఉంచినట్లు సమాచారం.
MLA MS Babu Comments On CM Jagan: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పని తీరు బాగోలేదంటూ దళిత ఎమ్మెల్యేలకే ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. కేవలం దళితులు ఉన్న చోటే అభ్యర్థులను మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Jagan Mohan Reddy Vs YS Sharmila: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? సొంత అన్నను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇదే భయం ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోందా..? అందుకే చెల్లెలు పుట్టింటికి రాకుండా జగన్ రాయభారం పంపారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
Alla Ramakrishna Reddy Comments: ఆళ్ల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని పార్టీని వీడలేదన్నారు. వైఎస్ షర్మిలతో తన ప్రయాణం అని చెప్పారు. నారా లోకేష్‌ను ఓడించిన తనకు సహకారం అందించకుంటే ఎలా అని నిలదీశారు.
Pawan Kalyan Letter to PM Modi: ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలన్నారు. లెక్కలతో జనసేనాని లేఖలో ప్రస్తావించారు.
AP Assembly Elections 2024: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా..? రెండు చోట్ల నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? సీట్ల కేటాయింపుల్లో ప్రశాంత్ కిషోర్ మార్క్ చూపిస్తున్నారా..? చంద్రబాబు కీలక నిర్ణయాల వెనుక ఉన్నదెవరు..? అసలు బాబు వ్యూహం ఏంటి..?
Chandrababu Naidu on CM Jagan: ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతే అవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వానికి మరో 100 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
House Site Pattas To TTD Employees: ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.
Minister Kottu Satyanarayana: శ్రీశైలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కొట్టు సత్యనారాయణ హాజరవ్వగా.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వేదికపైనే మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వాదనలకు దిగారు. చివరకు ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్లి పరీక్షించుకుందామని మంత్రి అంటే.. చిన్న చిన్న విషయాలు సీఎం వరకు ఎందుకు అని ఎమ్మెల్యే అన్నారు. అసలు ఏం జరిగిందంటే..?
AP Assembly Election 2024: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. జగన్‌తోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. తన ఆరోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలుపు కోసం కృషి చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
CM Jagan Kadapa Tour: సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నేడు కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
Minister RK Roja As Santa Claus: సాయం చేయాలంటూ ఓ బాధితుడు షేర్ చేసిన వీడియోకు మంత్రి రోజా చలించిపోయారు. శాంటా క్లాస్ వేషంలో వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలోకి శాంటా క్లాస్ వేషంలో వెళ్లిన మంత్రి రోజాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Salary Hike For AP Volunteers: ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు గుడ్‌న్యూస్. సీఎం జగన్ బర్త్ డే కానుకగా రూ.750 జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు.
Jagananna Videshi Vidya Deevena Funds: జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.107 కోట్లను 408 మంది పిల్లలకు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ స్కీమ్ ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామన్నారు.
Tirumala Break Darshan: డిసెంబర్ 19న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 18న సిఫారసు లేఖలను స్వీకరించమని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా..
Pawan Kalyan Review Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు వ్యక్తిగతం 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. తెలంగాణలో పవన్ కంటే బర్రెలక్క ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
Tenth and Inter Exam Date 2024: విద్యార్థులకు ముఖ్యగమనిక. ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.