Hyderabdad Rains: హైదరాబాద్ లో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. నిన్న ఉదయం భారీగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యలో కాస్త తెరపి ఇచ్చిన వరుణడు.. మళ్లీ ఈ రోజు ఉదయం నగర ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు.
Cricketer Mohammed Siraj Brings Home Brand New Range Rover Luxury: తెలంగాణ నుంచి వెళ్లి భారత క్రికెట్ జట్టులో సత్తా చాటుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త కారును కొనుగోలు చేశాడు. టీ20 ప్రపంచకప్, శ్రీలంక సిరీస్ అనంతరం విరామం తీసుకున్న సిరాజ్ కుటుంబంతో కలిసి కారు కొన్నాడు. ఆ కారు ధర ఎంత తెలుసా?
Hyderabad Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం గత రెండు వారాల క్రితం వరకు బాగానే పడ్డ.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుఝాము నుంచి హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి.
Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. శ్రావణమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత తగ్గుతుందని ఆశపడిన వారికి పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా షాకిస్తున్నాయి. కాగా నేడు దేశంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Krishna Vamsi Fire On Couple Marriage In Theatre: థియేటర్లో మురారి సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో పెళ్లి చేసుకోవడంపై దర్శకుడు కృష్ణ వంశీ బదులిచ్చారు. ఆ పెళ్లి చేసుకున్న యువతపై మండిపడ్డారు.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది. ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.
Chandrababu Focus On Telangana TDP: ఏపీలో మాదిరి తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.
Bandi Sanjay Kumar Comments On KT Rama Rao: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర కలకలం రేపాయి. కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని.. త్వరలో జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tungabhadra Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీగా కురస్తోన్న వర్షాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన డ్యాములైన శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ లు నిండాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు ప్రాజెక్టులకు ఎగువనున్న తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో ఈ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.
Naga Panchami Miracle Sai Baba Idol Drank Milk In Hyderabad: శ్రావణమాసం.. నాగుల పంచమి రోజు అద్భుతం చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగారనే వార్త హైదరాబాద్‌లో హల్చల్ చేసింది.
Ghmc Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి తాను ప్రతిరోజు ఫుడ్ డెలివరీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇది ఫుడ్ డెలీవరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నానని మీటింగ్ లో ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Devotees Plays With Snakes In Bonalu: ఇటీవల జరిగిన బోనాల సంబరాల్లో పాములు, విషసర్పాలతో విన్యాసాలు చేసిన వీడియోలు కలకలం రేపాయి. ఫలహార బండ్ల ఊరేగింపులో కొందరు కొండ చిలువలు, పాములతో విన్యాసాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Viral video: విద్యానగర్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు దిల్ సుఖ్ నగర్ కు వెళ్తున్న బస్సును ఆపమని కోరింది. కానీ అది స్టాప్ కాకపోవడంతో డ్రైవర్ ఆపలేదు. దీంతో కోపంతో రెచ్చిపోయింది. ఏకంగా బస్సుపై దాడికి తెగబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Hyderabad Job Fair For Women: హైదరాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా భారీ జాబ్ మేళా. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చెంజ్ ఆఫ్ తెలంగాణ (DEET), WE Hub కలిసి ఈ జాబ్ మేళా నిర్వహిస్తోంది. దీనికి కేవలం ఆడవాళ్లు మాత్రమే అర్హులు.
Uppal Skywalk Liftb Stuck: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన అనంతరం తలుపులు తెరచుకోకపోవడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Karate Kalyani Meets To RJ Shekar Basha: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో తెరపైకి వచ్చిన ఆర్జే శేఖర్ భాషా ఇటీవల గాయపడ్డారు. ఓ టీవీ షోలో లావణ్య గాయపర్చారని సమాచారం. గాయంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. దాడిపై విస్మయం వ్యక్తం చేశారు.
TCSB Secures Rs 85 Crore Refund For Cyber Fraud Victims: తెలంగాణ పోలీసులు సరికొత్త ఘనత సాధించారు. సైబర్ మోసగాళ్ల బారినపడిన బాధితుల సొమ్మును సైబర్ పోలీసులు భారీగా రికవరీ చేశారు. శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.