దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మంగళవారం ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం ఒక విధంగా మంచిదే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. విరాట్ బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టూర్లో వన్డే సిరీస్‌కు విరాట్ దూరంగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిసిస్తున్నాయి.
India squad for South Africa tour : దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే భారత టెస్ట్ టీమ్ ఫైనల్ అయ్యింది. జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు. 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది.
టీమిండియా తుది జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పక్కకుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్ వేశాడు.
మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం మంగళవారం (డిసెంబర్ 7) దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ డీన్ ఎల్గర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న టెంబా బావుమా.. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
IND Vs SA Series 2021 Schedule: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ద్వైపాక్షిక సిరీస్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా.. డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' పంజా విసురుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్ మాత్రమే ఆడుతామని.. టీ20 సిరీస్ తర్వాత ఆడుతామని స్పష్టం చేసింది.
ఇటీవలే భారత జట్టు టీ20 పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు త్వరలోనే మరో బాధ్యత కూడా అప్పజెప్పే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి రోహిత్‌కు ఆ పదవి ఇవ్వనుంది.
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భారత్ శుభారంభం లభించింది. సౌతాఫ్రికాతో బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే ఆ లక్ష్యాన్ని అందుకోగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి పెవిలియన్‌కు పంపించడంలో భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో... అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రాణించాడు.
ప్రపంచ కప్‌లో టీమిండియా ఆరంగేట్రం చేయకముందే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జూన్ 5న టీమిండియా ఆడనున్న తొలి మ్యాచ్‌లో దక్షిణ ఆఫ్రికాను ఢీకొట్టడానికి సిద్ధపడుతున్న వేళ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.