పార్లమెంట్ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను సందర్శించారు.
ఫార్మ దిగ్గజం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెలలో సౌమిత్ర ఛటర్జీకి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన తరువాత కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు.
బీహార్ దివగంత గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంపాటు సామాజిక సామరస్యానికి భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి ఎనలేనిదని మోదీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి (Diwali 2020) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దీపావళి సందడే కనిపిస్తోంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో నెలకొన్న సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ప్రధాని మోదీకు లేఖ రాశారు. సిడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణల్ని ఆమోదించాలని కోరారు.
బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) (Keshubhai Patel) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం విషమించడంతో గురువారం (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు.
పాకిస్తాన్, చైనా దేశాలతో యుద్దం తేదీలు ఫిక్స్ అయ్యాయంటూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని సైతం స్పష్టం చేశారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి.
బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ ఛీఫ్ నితీష్ పై ఆరోపణలు చేయడమే కాకుండా..ప్రదాని మోదీకు సూచనలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.