అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
PM Modi On Skill India Fifth Anniversary: వరల్డ్ యుూత్ స్కిల్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) యువతను ఉద్దేశించి సంభోధించారు. ఆత్మ నిర్భర్ భారత్ ( Atmanirbhar Bharat ) కల సాకారం అవడంలో యువతలో ఉన్న నైపుణ్యమే కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.
PM Modi speech highlights: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్పై గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ( Unlock 2.0 ) ప్రవేశించామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి.
PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్, అన్‌లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
యోగాతో ( YOGA ) కరోనాను ఎదుర్కోవచ్చని.. అది మన జీవనయానంలో ఓ భాగం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International yoga day ) ఇళ్లలో ఉండి జరుపుకోవల్సివస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. లాక్డౌన్ 4.0లో ( Lockdown exemptions ) ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య ( COVID-19 positive cases in Delhi ) చాలా వేగంగా పెరుగుతోంది.
అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు.
ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ( Atma nirbhar package ) పేరుతో ప్రధాని మోదీ సర్కార్ ( PM Modi govt ) ప్రవేశపెట్టిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ( Rs 20 lakh crore package ), ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) ఐదు రోజులపాటు ఆ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించడాన్ని దేశంపై ఓ కృూరమైన జోక్‌గా ( Cruel joke ) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) అభివర్ణించారు.
కరోనావైరస్ పై దేశం చేస్తోన్న పోరాటంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆత్మ నిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat ) పేరిట కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ఎకనమిక్ ప్యాకేజీ ( Economic package ) గురించి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) మీడియాకు వివరించారు.
లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి.
కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.