Bandi Sanjay: తెలంగాణకు మోదీ బర్త్ డే గిఫ్ట్.. కరీంనగర్‌లోనే తొలిసారి..!

Augmented Reality Training in Karimnagar: ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా తెలంగాణలో ఎంపీ నిధులతో ‘ఏఆర్ వీఆర్ ల్యాబ్’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్‌లో ఐటీఐ అభ్యసించిన ప్రతి విద్యార్ధికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 18, 2024, 06:14 PM IST
Bandi Sanjay: తెలంగాణకు మోదీ బర్త్ డే గిఫ్ట్.. కరీంనగర్‌లోనే తొలిసారి..!

Augmented Reality Training in Karimnagar: కరీంనగర్ ఐటీఐ కాలేజీలో తొలిసారిగా అగ్ మెంటెడ్ రియాలిటీ, వీడియో వర్చువల్ రియాలిటీ పద్దతిలో వివిధ కోర్సులకు సంబంధించి బోధన ప్రారంభమైంది. నేషనల్ ఇన్ స్ట్రక్షనల్ మీడియా ఇన్ స్టిట్యూట్(నిమి) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసోం, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తోపాటు ఏపీలోని వైజాగ్ రాష్ట్రాల్లో మాత్రమే ‘AR VR ల్యాబ్’ ద్వారా ఐటీఐ కాలేజీల్లో కోర్సులను ప్రాక్టీస్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలోని తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ ఐటీఐ కాలేజీలో ఏఆర్, వీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఐటీఐ విద్యార్థి ఏ ట్రేడ్లోనైతే చేరతాడో.. ఆ కోర్సును  AR VR ల్యాబ్ ద్వారా లైవ్ లో నేర్చుకోవచ్చు.  ఎలక్ట్రిషియన్, వైర్ మేన్ ట్రేడ్, వెల్డర్, ఫిట్డర్, మెకానికల్ ట్రేడ్, టర్నర్ ట్రేడ్ ఇలా పలు రకాల కోర్సులను AR VR ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘‘సేవా పక్వాఖా’’ పక్షోత్సవాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ లాడ్స్ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

Also Read: Anil Ambani: రిలయన్స్ పవర్ రుణభారం తీరిపోయింది.. అనిల్ అంబానీ కంపెనీలకు మంచి రోజులు   

బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ ఐటీఐ కాలేజీకి విచ్చేసిన బండి సంజయ్..  ఏఆర్, వీఆర్ ల్యాట్‌ను ప్రారంభించారు. అగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఉదేశించి మాట్లాడుతూ.. ‘ఇది పైలెట్ ప్రాజెక్టు మాత్రమే. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏఆర్ వీఆర్ ల్యాబ్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతిమంగా కరీంనగర్ ఐటీఐలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలని, అదే సమయంలో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్ధికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఐటీఐ కాలేజీలో వాష్ రూంకు ఇబ్బంది ఉందని, కిటికీలు దెబ్బతిన్నాయని విద్యార్ధులు సంజయ్ దృష్టికి తీసుకురావడంతో వాటితోపాటు కాలేజీలో కనీస సౌకర్యాలన్నీ కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

"నరేంద్రమోదీ ప్రభుత్వం స్కిల్ డెవలెప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పిల్లలకు చదువు చెప్పి పంపితే సరిపోదు.. బయటకు వెళ్లే ముందే ఆ కోర్సుకు సంబంధించి మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకునే విధంగా పూర్తి నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే మోదీ లక్ష్యం. మన కరీంనగర్ ఐటీఐ కాలేజీ విషయానికొస్తే 1994లో ఏర్పాటు చేసుకున్నం. ఈ 30 ఏళ్లలో టెక్నాలజీలో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ అందుకు అనుగుణంగా టెక్నాలజీని అప్ డేట్ చేసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో AR VR ల్యాబ్‌ను పైలెట్ పద్దతిలో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి AR VR ల్యాబ్ ఇది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కానీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. 

AR VR అంటే అగ్ మెంటెడ్ రియాలీ (చేస్తున్న పనికి సంబంధించిన వైబ్రేషన్స్), వర్చువల్ రియాలిటీ (కళ్ల ముందే కన్పించడం) ఐటీఐలో చేరిన విద్యార్థి ఏ కోర్సులోనైతే చేరతాడో.. ఆ కోర్సును  AR VR ల్యాబ్ ద్వారా లైవ్‌లో నేర్చుకోవచ్చు. ఎలక్ట్రిషియన్, వైర్ మేన్ ట్రేడ్, వెల్డర్, ఫిట్డర్, మెకానికల్ ట్రేడ్, టర్నర్ ట్రేడ్ ఇలా పలు రకాల కోర్సులను AR VR ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకు టైలరింగ్ కోర్సు తీసుకుంటే.. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రకాల డిజైన్లతో ఎట్లా టైలరింగ్ చేస్తున్నారో ఈ AR VR ల్యాబ్‌లో నేర్చుకోవచ్చు. మన కళ్ల ముందే కొత్త కొత్త పద్దతుల్లో టైలరింగ్ నేర్చుకునే విధానం కన్పిస్తుంది. దానికి తగ్గట్లుగా కటింగ్, డిజైనింగ్, ఎంబ్రాయిడింగ్ వంటివి నేర్చుకోవచ్చు. AR VR లో కళ్లముందే కన్పించడమే కాదు.. నేర్చుకునే క్రమంలో ఆ ఫీల్‌కు సంబంధించి వైబ్రేషన్స్ కూడా మన చేతులకు తగులుతాయి.

గతంలో ల్యాబ్‌లో ఒక గంట పాటు నేర్పేవారు. అధ్యాపకుల కొరత ఉన్నందున విద్యార్థులపై వ్యక్తిగతంగా మానిటరింగ్ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ ల్యాబ్ ద్వారా ఆ పరిస్థితి ఉండదు. విద్యార్థులు ఎన్ని గంటలైనా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరు ఎంత సేపు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎవరు ఏ తప్పు చేస్తున్నారో గమనించి వాటిని సరిచేసే అవకాశం కూడా AR VR ల్యాబ్ ద్వారా అవకాశం కలుగుతుంది. 

హార్డ్ వేర్ మిషన్ తీసుకుంటే... కొంతకాలానికి అప్ డేట్ వెర్షన్ మిషన్ వస్తే.. పాతది పక్కన పడేయాలి. కొత్త హార్డ్ వేర్‌ను తెచ్చుకుని దాని ప్రకారం నేర్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండేది కాదు. AR VR ల్యాబ్ వల్ల ఆ బాధ లేదు.  ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఆప్ డేట్ అయిన మిషన్ల ద్వారా ఎట్లా వర్క్ చేయవచ్చు తెలుసుకునే అవకాశం విద్యార్థులకు ఏర్పడింది. ఇవన్నీ కూడా ఐటీఐ కరిక్యులమ్ ప్రకారమే పాఠాలను డిజిటైలేషన్ పద్దతిలో బోధిస్తారు." అని బండి సంజయ్ తెలిపారు. 

Also Read: AP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News