Hyderabad Police: ప్రజలకు కష్టం వస్తే పోలీసులను ఆశ్రయించడం మామూలే. రేయి, పగలు అని తేడా లేకుండా సామాన్యుడికి అండగా ఉండడంతో పాటు శాంతిభద్రతలను కాపాడుతున్నారు పోలీసులు. అయితే అంతటి గొప్ప డిపార్ట్‌మెంట్ లో కొందరు మాయని మచ్చ తెస్తుంటే.. మరి కొందరు వారి పనులతో ప్రజలకు సేవలు చేస్తూ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారి వల్ల పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే వైరల్ గా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో.. స్వయంగా ఓ పోలీస్ అధికారిణి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తీసేస్తున్నారు. దారికి అడ్డుగా వర్షం నీరు నిలబడకుండా ఆమె శుభ్రం చేశారు. ఆ పనికి ఆమెపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా ఎడతరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల అన్నీ జలమయం అయ్యాయి. ఈ వరద నీటితో పాటు చెత్త కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. ఇలా పలు డ్రైనేజీలు చెత్తతో కూరుకుపోయిన వర్షం నీరు ముంచెస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
#HYDTPinfo
Smt. D. Dhana Laxmi, ACP Tr South West Zone, cleared the water logging by removing the clog at drain water near Tolichowki flyover.@AddlCPTrfHyd pic.twitter.com/lXDLix6dMp— Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023
Also Read: Huawei Mate X5 Price: చీప్ అండ్ బెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్ అవుతారు!
నగరంలోని టౌలీచౌక్ ఫ్లై ఓవర్ వద్ద కూడా చెత్త భారీగా పేరుకుపోయింది. ఈ కారణంగా ఓ డ్రైనేజీ పై భాగం చెత్తతో మూసుకుపోయింది. ఆ అడ్డంకి కారణంగా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. స్వయానా ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ ఏసీపీ ధనలక్ష్మీ శుభ్రం చేసేందుకు ముందుకు కదిలారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఇందులో మిగిలిన కొందరు పోలీసులు కూడా పాలుపంచుకున్నారు. ఇప్పుడా వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పని చేపట్టిన సౌత్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ డి.ధనలక్ష్మీని పలువురు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Petrol And Diesel Prices: శుభవార్త.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook