ఆల్‌ వెజిటేబుల్ స్పెషల్‌ కిచిడి రెసిపీ.. రుచి భలే ఉంటుంది!

Dharmaraju Dhurishetty
Oct 19,2024
';

వెజిటేబుల్ కిచిడిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

వెజిటేబుల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి.

';

వెజిటెబుల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెసరపప్పు, కూరగాయలు (కాకరకాయ, బీన్స్, క్యారెట్, బఠానీలు మొదలైనవి), ఉల్లిపాయ

';

కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు

';

కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, నూనె, కొబ్బరి చట్నీ (కావాల్సినంత)

';

తయారీ విధానం..పెసరపప్పును నీటిలో వేసుకుని కొద్ది సేపు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

బియ్యాన్ని కుక్కర్‌లో వేసి, నీరు, ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి చల్లార్చండి.

';

ఆ తర్వాత అన్ని కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోండి.

';

ఒక పాత్రలో నూనె వేడి చేసి అందులోనే ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసి వేగించండి.

';

తరుగుకున్న ఉల్లిపాయను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.

';

తరుగుకున్న కూరగాయలన్నింటిని వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించండి.

';

నానబెట్టిన పప్పును కూరగాయలతో కలిపి ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కూరగాయల మిశ్రమంలో వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత బాగా ఉడికించి, నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story