మౌనీ రాయ్ సినిమాల కంటే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. అలా స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై లక్ పరీక్షించుకుంది.
వెండితెరపై కూడా ఈమె చెలరేగి పోయింది. అక్కడ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి అట్రాక్ట్ చేసింది.
మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో పరిచయమైంది.. ఆ తర్వాత ఈమె ముఖ్యపాత్రలో నటించిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.
స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌని రాయ్. నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో కథానాయికగా పరిచయమైంది.
2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె సౌత్‌లో 'కేజీఎఫ్' మూవీలో ఐటెం సాంగ్‌లో నటించి ఇక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. అటు బ్రహ్మస్త్ర సినిమాకు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఆ తర్వాత నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్ హీరోలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో జునూన్ అనే విలన్ పాత్ర మౌని రాయ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఈమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బిహార్‌లో 1985 సెప్టెంబర్ 28న బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించింది.
తండ్రి ప్రముఖ అనిల్ రాయ్ బెంగాలీ రంగస్థల నటుడు.. ఈమె తల్లి కూడా థియేటర్ ఆర్టిస్ట్. ఈమె విద్యాభ్యాసం కూచ్ బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది.
మౌని రాయ్ సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకు షిఫ్ట్ అయింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.