పూజా హెగ్డే విషయానికొస్తే.. తమిళ సినిమా 'మూంగముడి' మూవీతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో పరిచయమైంది.
ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.
రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాల ఫ్లాపులతో తగ్గిన అవకాశాలు..
గుంటూరు కారం సినిమాలో ముందుగా ఈ భామను అనుకున్నారు. వరుస ఫ్లాపుల కారణంగా ఈమెను తొలిగించారు.
వరుస అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది ఈ భామ.
అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అరవింద సమేత వీరరాఘవ'సినిమాలో అరవిందగా మంచి నటనే కనబరించింది.
ఆపై అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో బుట్టబొమ్మగా ఈమెకు మంచి క్రేజే వచ్చింది.