గుంటూరు కారం భారీ హిట్ కాలేదు.. అలా అని డిజాస్టర్ కాలేదు. ఓ మోస్తరు విజయంతో శ్రీలీల కెరీర్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కంటిన్యూగా వరుస ఫ్లాపులు పలకరించడంతో అమ్మడి కెరీర్ డీలా పడిందనే చెప్పాలి.
సినీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో శ్రీలీల ఒకరు.
గతేడాది వరకు తెలుగులో వరుస అవకాశాలతో క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీలీల.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది శ్రీలీల.
శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచింది.
ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీల ఫేట్ మారిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.
కెరీర్ గతేడాది శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది.
ఇందులో బాలకృష్ణ బిడ్డ పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.
హీరోయిన్గా కేవలం యంగ్ హీరోల సరసనే కాకుండా టాప్ స్టార్స్ సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది.