టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి .. 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో నటించింది.
హీరోయిన్గా 2013లో విడుదలైన ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో పరిచయమైంది.
తెలుగులో అత్యధిక పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగిపోయింది.
తెలుగులో అదుర్స్, సూపర్ సింగర్ 9, పటాస్ వంటి టీవీ ప్రోగ్రామ్స్ శ్రీముఖికి మంచి పేరు తీసుకొచ్చాయి.
సినిమాల్లో నేను శైలజా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి, భోళా శంకర్ సహా పలు కన్నడ సినిమాల్లో నటించింది.
ఇక క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది. అక్కడ శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.
శ్రీముఖి తెలంగాణలోని నిజామాబాద్‌లో 10 మే 1993లో జన్మించింది.
శ్రీముఖి తండ్రి రామ్ కిషన్ ప్రముఖ కంపెనీలో మంచి పొజిషన్లో పనిచేస్తున్నారు. తల్లి లత బ్యూటీషియన్.. తమ్ముడు సుష్రుత్, చెల్లెలు చెర్రీ ఉన్నారు.
త్వరలో శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ఈ యేడాదే పెళ్లి పీఠలు ఎక్కుబోతున్నట్టు సమాచారం.