Teach for Change: ప్రముక సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో జరిగింది..
ప్రతి సంవత్సరం ఈ షో జరగగా ఈసారి జరిగిన ఈ షో కోసం ఈ సారి షో స్టాపర్లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్.. అటెండ్ అయ్యారు..
వారిద్దరితోపాటు హర్షవర్ధన్ అలానే ప్రముక క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా ర్యాంప్ వాక్ చేశారు.
వారితోపాటు హైదరాబాద్ నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముకులు హాజరై తమవంతు సాయాన్ని అందిస్తూ నాణ్యమైన, మెరుగైన విద్యకు సాయంగా నిలిచారు.
ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి.. కార్యక్రమాలకు కోసం వినియోగిచబడుతుంది.
ఈ షో లో సీరత్ ప్రదీప్ మాచిరాజు, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్, శ్రియా శరణ్, హర్షవర్ధన్ రాణే, ఫరియా అబ్దుల్లా, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, అలేక్య హారిక, రాశి సింగ్, అక్షర గౌడ, అశోక్ గల్లా, వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మి మంచు మాట్లాడుతూ " ది టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో కేవలం స్టైల్.. గ్లామర్ మాత్రమే కాదు; అవసరమైన పిల్లల జీవితాలలో అర్ధవంతమైన మార్పును సృష్టించడానికి చేస్తున్న గొప్ప ప్రయత్నం అన్నారు.
శ్రియా శరణ్ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్స్ వార్షిక ఫ్యాషన్ షో నిధుల సమీకరణలో భాగమవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్నారు.
హర్షవర్ధన్ రాణే మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా మంచు లక్ష్మి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు టీచ్ ఫర్ చేంజ్ చొరవలో భాగం కావడం అద్భుతమని ప్రశంసించారు.