మనం మైండ్ రీసెట్ చేసుకోవడం కోసం మామూలు టీ కాకుండా బ్లాక్ జింజర్ టీ తాగితే కూడా ఎంతో ప్రభావం ఉంటుంది..
మరో విశేషం ఏమిటి అంటే ఈ టీ తాగడం వల్ల ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది.
ఇది చేసుకోవడం కోసం ముందుగా..టీ పొడి - ఒక స్పూను, తేనె - ఒక స్పూన్ తీసుకోండి.
అలానే అల్లం తరుగు - ఒక స్పూను కూడా తరిగి పెట్టుకోండి.
ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి కొంచెం నీళ్లు వేడి చేసుకోండి.
నీళ్లు సుమారుగా వేడెక్కాక.. టీ పొడిని వేయాలి.
ఆ తరువాత అందులోనే అల్లం తరుగును వేసి నీరుని బాగా మరిగించాలి.
నీళ్లు బాగా మరిగాక.. ఈ టీ ని వడకట్టి క్లాసులో పోసుకోండి.
నీరు కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకొని తాగాలి.
ఈ బ్లాక్ జింజర్ టీ తాగడం ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ని అదుపులో పెడుతుంది.