రాగుల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ లభిస్తాయి. కాబట్టి ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తింటే. కడుపు నిండిన భావనను కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
జొన్న రోటీల్లో కూడా ఫైబర్, ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
బార్లీలో ఫైబర్, బీటా-గ్లూకాన్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
సోయా రోటీల్లో ప్రోటీన్, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
క్యారెట్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
పాలకూరతో తయారు చేసిన రోటీల్లో ఫైబర్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి.
బ్రోకలీ రోటీల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
గోధుమ పిండి రోటీల్లో కూడా ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవ్వి కూడా బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.