ప్రస్తుతం చిన్న వయస్సు గల వారు కూడా తీవ్ర జ్ఞాపకశక్తి సమస్యల బారిన పడుతున్నారు.
జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
మెదడు చురుకుగా తయారు కావడానికి ప్రతి రోజు ఆహారంలో పోషకాలు ఉండే పచ్చి కూరగాయలు తీసుకోవాలి.
జ్ఞాపకశక్తి పెరగడానికి పచ్చి ఆకు కూరలు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించేందుకు బీట్రూట్ రసం కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.
బీట్రూట్ రసంలో ఉండే ఔషధ గుణాలు మెదడును చురుకుగా చేసేందుకు దోహదపడుతుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడమే కాకుండా మెదడు చురుకుగా తయారవుతుంది.
పసుపు టీ తాగడం వల్ల కూడా జ్ఞాపకశక్తి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ప్రతి రోజు బెర్రీల జ్యూస్ తాగే వారిలో సులభంగా జ్ఞాపకశక్తి పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.