Diabetes Fruit: డయాబెటిస్ రోగులకు సీతాఫలం వరమేనా, స్థూలకాయానికి సైతం చెక్
ప్రస్తుతం మార్కెట్‌లో సీతాఫలాలు అందుబాటులో ఉన్నాయి. సీతాఫలం ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది
సీతాఫలంలో విటమిన్లు, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి
సీతాఫలంలో ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి గుణాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె రోగాల్ని దూరం చేస్తుంది
సీతాఫలంలో ఉండే ఫైబర్ బరువు తగ్గించేందుకు సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది
సీతాఫలంలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ దరిచేరకుండా కాపాడుతుంది
సీతాఫలంను సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనివల్ల చర్మ సంరక్షణ, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.