BP Control Tips: అధిక రక్తపోటును సులభంగా ఇలా నీళ్లు తాగి తగ్గించవచ్చు. ఎలాగంటే
నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ప్రతి చిన్న వ్యాధికి నీటితోనే చికిత్స ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం గుండె ఆరోగ్యానికి సైతం మంచిదని తెలుసా
ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా టీనేజ్ వయస్సులో కూడా గుండె వ్యాధులు సంభవిస్తున్నాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండె వ్యాధుల ముప్పు తగ్గించవచ్చు
నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్త నాళాలు, రక్త పోటులో సమస్య రావచ్చు. దాంతో గుండె వ్యాధులు ముప్పు పెరుగుతుంది. అందుకే శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి
శరీరం హైడ్రేట్‌గా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ వాల్యూమ్‌ను స్థిరంగా ఉంచి గుండె పనితీరు సరిగ్గా ఉండేట్టు చేస్తుంది.
రక్త నాళాలు సక్రమంగా సంకోచించడం, వ్యాకోచించేలా చేస్తాయి నీళ్లు. సోడియం పొటాషియం బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది
శరీరం సరిగ్గా హైడ్రేట్ అయి ఉంటే గుండె, రక్త నాళాలు సక్రమంగా పనిచేస్తాయి. నీళ్లు తక్కువగా తాగితే మాత్రం రక్తం చిక్కగా మారుతుంది. దాంతో బ్లడ్ షుగర్ పెరగవచ్చు.
విపరీతమైన తలనొప్పి, ఛాతీలో నొప్పి, తల తిరగడం వంటివి కన్పిస్తే ఇవి బ్లడ్ ప్రెషర్ లక్షణాలు. వెంటనే వైద్యుని సంప్రదించాలి
ప్రతి ఒక్కరూ రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. అంటే 2 లీటర్లు తప్పకుండా తాగాలి
అలాగని మరీ ఎక్కువ నీళ్లు కూడా తాగకూడదు. నీళ్లు మరీ ఎక్కువైతే సోడియం లెవెల్స్ పల్చబడి ఆరోగ్య సమస్యలు రావచ్చు