ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది పెద్ద ముప్పుగా మారింది. రోజు రోజుకు షుగర్ వ్యాధిగ్రస్తుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఫుడ్స్ తింటే భవిష్యత్తులో డయాబెటిస్ రావడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దాం.
చిప్స్, వేయించిన చికెన్, పకోడిలు, సమోసాలు ఇవన్నీ కూడా షుగర్ ను ప్రేరేపిస్తాయి. ఈ ఫుడ్స్ మితంగా తినడం మంచిది.
కేకులు, బర్గర్లు, కుకీలు ఇలాంటి ఫుడ్స్ జోలికి అస్సలు పోకండి. ఇవి షుగర్ ను పెంచుతాయి.
రెడీమేడ్ ఫుడ్, డాల్డా, మయోన్నైస్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్ షుగర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
బేకన్, గొడ్డు మాంసం, కాల్చిన చికెన్, కాల్చిన మాంసాలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన జంతు ఆధారిత ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు.
పొడిగింజలు, కాల్చిన వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇలాంటి తక్కువగా తినాలి.
ఇలాంటి పదార్థాలు తింటే భవిష్యత్తులో షుగర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఏజీఈ కాంపౌండ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి అది షుగర్ వ్యాధికి దారిస్తుందని తినే ఫుడ్స్ కంటే వండే విధానంపై ఫోకస్ పెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.