నెయ్యి అత్యంత బలవర్ధకమైన ఆహారం. రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైంది. అందుకే అందరూ ఇష్టపడుతుంటారు
ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో నెయ్యి తీసుకుంటారు. కొంతమంది రొట్టెతో కొంతమంది పప్పులో కలిపి తింటారు
కానీ కొలెస్ట్రాల్ రోగులు నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం పీడిస్తుంటుంది.
నెయ్యిలో పెద్దఎత్తున ఫ్యాట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ రోగులకు మంచిది కాదంటారు కొంతమంది.
ఇంకొన్ని అద్యయనాల ప్రకారం నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్‌పై ప్రభావం ఉండదని తెలుస్తోంది.
అయితే ఎక్కువ మోతాదులో నెయ్యి తింటే మాత్రం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుుతున్నారు.
నెయ్యి మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమౌతుంది.
నెయ్యి ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు రోగాలు ముప్పు పెరుగుతుంది.
ముందు నుంచే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే నెయ్యి తక్కువగా తినడం మంచిది.