నేటికాలంలో చాలా మంది బ్లడ్ షుగర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం.
షుగర్ ను తగ్గించడంలో తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ పేషంట్లుముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం పోషక విలువలున్న ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి.
తులసి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
తులసి ఆకులను రోజూ నమలడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఈ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. షుగర్ పేషంట్లకు మేలు చేస్తాయి.
తులసి ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అనేక వ్యాధులను శరీరం ఎదుర్కుంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ నమిలడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రోజూ తులసి ఆకులను నమలడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే ఎంతో మంచిది.