ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఓట్స్ గారెలు తయారీ విధానం ఒకసారి చూద్దాం..
ముందుగా అర కప్పు మినప్పప్పును నాలుగు గంటల నానపెట్టుకొని రుబ్బుకోవాలి. మరోపక్క ముప్పావు కప్పు ఓట్స్ ని అరగంట పాటు నానబెట్టాలి.
మినప్పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులోనే నానబెట్టిన ఓర్చుని వేసి బాగా కలుపుకోవాలి
తరిగిన ఒక పచ్చిమిర్చి.. ఒక ఉల్లిపాయ.. ఒక స్పూన్ జీలకర్ర.. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కావాలంటే కొంచెం నీటిని వేసుకుంటా కలుపుకోవచ్చు అయితే గారెలు బాగా రావడానికి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది.
స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై కోసం సరిపడా నూనెను కొని ఆ నూనె వేడెక్కాక.. చేసుకున్న మిశ్రమాన్ని గారెల్లా వత్తుకొని నూనెలో వేయాలి.
బాగా ఫ్రై అయ్యాక తీస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఓట్స్ వడ రెడీ