మఖానాలో కార్బహైడ్రేట్స్ ఉంటాయి. నెయ్యిలో వేయించుకుని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది.
నెయ్యిలో వేయించిన మఖానాలో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి.
మఖానా, నెయ్యిని కలిపి తింటే మన పేగు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్యలు దరిచేరవు.
మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ స్నాక్ ఆప్షన్
మఖానా, నెయ్యి కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. షుగర్ తో బాధపడేవారికి మఖానా మంచి పోషకాహారం.
మఖానాలో కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇందులో విటమిన్ డీ కూడా ఉంటుంది కాబట్టి అస్టియోపరోసిస్ నుంచి కాపాడుతుంది. ఎముకల బలానికి ప్రోత్సహిస్తుంది.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
నెయ్యిలో మాయిశ్చరైజర్ గుణాలుంటాయి. మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీంతో చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల నంచి బయటపడొచ్చు.
నెయ్యిలో వేయించిన మఖానా మంచి బ్రెయిన్ బూస్టింగ్ స్నాక్