పొట్లకాయలో ఎక్కువగా ఉండే నీరు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
పొట్లకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడానికి సహాయపడతాయి.
పొట్లకాయలో కేలరీలు తక్కువగా ఉండడంతో పాటు నీరు ఎక్కువగా లభిస్తుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గొచ్చు.
పొట్లకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
పొట్లకాయలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేయడమే కాకుండా ముడతలు, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది.
పొట్లకాయలో బీటా-కెరోటిన్ అధికంగా లభిస్తాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో గానో సహాయపడుతుంది.
పొట్లకాయలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరడానికి కూడా ఉపయోగపడుతుంది.
పొట్లకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.