ప్రతిరోజూ డైట్లో స్పిరులినాను చేర్చుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో చూద్దాం.
సిర్పులినా అనేది సముద్రపు ఉప్పునీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క. దీన్ని చూస్తే ఛీ అంటారు. కానీ అందులోని ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వావ్ అంటారు.
స్పిరులినాలో ప్రొటీన్, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. 60శాతానికి పైగా ప్రొటీన్స్ ఉంటాయి. విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
స్పిరులినాను ఆహారంలో చేర్చుకుంటే డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతాయి.
స్పిరులినాకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది శరీరానికి, మెదడుకు మేలు చేసే పోషకాలు ఇందులో మెండుగా ఉన్నాయి.
చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారు స్పిరులినాను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజూ గ్రాము స్పిరులినా పౌడర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
స్పిరులినాలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా స్పిరులినాను ఆహారంలో చేర్చుకోవాలి.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.