పొంగలి అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. మరి అలాంటి పొంగలిని మిల్లెట్స్ లో ఎలా చేసుకోవాలో చూద్దాం
ఇందుకోసం అరకప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్, అరకప్పు పెసరపప్పు, నాలుగు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల అవకాడో నూనె ముందుగా తీసి పెట్టుకోండి.
అలానే అర స్పూను మిరియాలు, ఒక స్పూను.. తరిగిన అల్లం.. కావాల్సినంత కరివేపాకు, జీడిపప్పు కూడా ఉంచుకోండి.
ముందుగా రాత్రంతా మిల్లెట్, పప్పును నానబెట్టుకోండి.
ఉదయం వాటిని మరోసారి కడిగి.. వడగట్టండి.
ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్‌లో అవకాడో నూనెను వేసి.. అది వేడెక్కిన తర్వాత.. ఎండుమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి.
ఇప్పుడు అందులోనే కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, తరిగిన అల్లం వేయండి.
జీడిపప్పు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత నానబెట్టిన మిల్లెట్, పప్పును వేయండి.
వాటిని రెండు నిమిషాలు వేయించాక.. మూత మూసివేసి.. మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
అయిపోయిన తరువాత మూత తెరిచి పొంగల్‌ను బాగా కలపండి. తాలింపు కోసం చిన్న పాన్‌లో అవకాడో ఆయిల్‌ను వేసి వేడి చేయండి. అందులో కరివేపాకు, జీలకర్ర వేయండి.
దానిని పొంగల్ పైన వేయండి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్ పొంగలి రెడీ..