అరటి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది అరటి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటున్నారు. దీని కారణంగా వారికి తెలియకుండానే అనేక రకాల దుష్ప్రభావాల బారిన పడుతున్నారు. అరటి అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి.
బరువు పెంచేందుకు అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇప్పటికే బరువు ఉన్నవారు వీటిని అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
చాలామందిలో వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు కొవ్వులు లభించకపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తినడం మానుకోండి.
కొంతమందిలో అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కొందరిలో కొత్త సమస్యలు కూడా వస్తాయి.
అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి వీటిని అతిగా తిన్నప్పుడు తిమ్మిర్లు గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
అరటి పండ్లను అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేవారు తప్పకుండా తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం పూట ఆఫీసుల్లో అతిగా అరటి పండ్లను తినడం వల్ల నిద్రలోకి జారుకునే అవకాశాలున్నాయి.
అరటి పండ్లలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తగిన మోతాదుకు మించి తినడం వల్ల పనులు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొంతమందిలో శరీరం లావుగా అవ్వడానికి ప్రధాన కారణం అరటి పండ్లను ఎక్కువగా తినడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే లావు ఉన్నవారు వీటిని ఎక్కువ తినడం మానుకోవాలి.