ఎక్కువ సమయంపాటు కూర్చొని పనిచేయడం సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బెల్లీఫ్యాట్ వస్తుంది.
కొన్ని ఆహారాలకు నో చెబుతూ బెల్లిఫ్యాట్ తగ్గించుకోవచ్చు.
అధిక నూనె వేసి ఫ్రై చేసిన ఆహారాలు అంటే అందరికీ ఇష్టం కానీ, ఇవి బెల్లీ ఫ్యాట్ పెంచేస్తాయి.
కొందరు కాస్త సన్నగా ఉన్నా రోజూ మద్యం తాగే అలవాటు వల్ల బొడ్డు చుట్టూ కొండలా కొవ్వు పేరుకుంటుంది.
ఈ ఆహారాల్లో కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి తినకూడదు. ముఖ్యంగా వైట్ పాస్తా వంటివి.
చిన్నవారు అయినా పెద్ద అయినా కూల్ డ్రింక్స్ తరచూ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ వస్తుంది.
అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారాలు ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌తో బాధపడాల్సిందే.
కొన్నిరకాల కేకులు, డోనట్స్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.
కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఫుడ్స్ తీసుకుంటే వెంటనే మరుసటి రోజు వ్యాయామం చేయాలి.
లేదా ఏవైనా డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.
లేకపోతే ఇలాంటి ఆహారాల వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి.