అందమైన కేశాలు అమ్మాయి అందాన్ని పెంచుతాయి. మీక్కూడా పొడవైన నల్లని నిగనిగలాడే కేశాలు కావాలంటే నెలరోజులు ఇలా చేయండి మరి
ఇటీవలి జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం శరీరంపై పడుతోంది. ఫలితంగా జుట్టు రాలడం, పల్చగా మారడం వంటి సమస్యలు సాధారణమయ్యాయి.
కేశాలు అందంగా నిగనిగలాడేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు.
మీక్కూడా ఇదే సమస్య ఉంటే కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు
ఉసిరి నిమ్మ హెయిర్ మాస్క్...ఈ మిశ్రమంలో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. కేశాల ఎదుగుదలకు అద్భుతంగా దోహదం చేస్తుంది.
అరటి పండు గుడ్డు హెయిర్ మాస్క్...అరటి పండు గుడ్డుతో చేసిన మాస్క్ జుట్టుకు రాయడం వల్ల కేశాలకుు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
మెంతులతో హెయిర్ మాస్క్...మెంతులతో తయారు చేసే హెయిర్ మాస్క్ రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య, తలలో దురద పోతుంది. ఈ మిశ్రమం రాసి దాదాపు 30 నిమిషాలుంచాలి.
అవకాడో హెయిర్ మాస్క్....అవకాడోలో పోషకాలతో పాటు హెల్తీ ఫ్యాట్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి కేశాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
వేప హెయిర్ మాస్క్...వేపాకులు తలకు, కేశాలకు చాలా మంచివి. వేపాకుల మాస్క్ రాయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కేశాలు నిగనిగలాడుతుంటాయి.