పొన్నగంటి కూరలో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరలోనూ ఉండవు. పొన్నగంటి కూరలో పెద్ద మొత్తంలో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్ రక్తహీనత నుంచి కూడా కాపాడతాయి.
పొన్నగంటి కూరను పోయిన కంటి కూర అని కూడా అంటారు. అంటే చూపు కోల్పోయిన వారికి సైతం ఈ కూర తినిపించినట్లైతే తిరిగి చూపు వస్తుందని నమ్మకం ఉంది.
పొన్నగంటి కూరను పప్పుగా గాని, కూర రూపంలో కానీ తినవచ్చు. పొన్నగంటి కూరలో ఉండే పోషకాల వల్ల మీరు మోకాళ్ల నొప్పుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
పొన్నగంటి కూర జ్యూస్ రూపంలో కూడా తీసుకోవడం ద్వారా మీరు విటమిన్ ఏ పుష్కలంగా పొందే అవకాశం ఉంటుంది.
పొన్నగంటి కూర ప్రతిరోజూ ఒక తప్పు తిన్నట్లయితే కంటి సమస్యలు ఉన్నవారికి చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
అలాగే రక్తహీనతతో బాధపడే వారికి కూడా పొన్నగంటి కూర చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మీ రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది
ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో.. వారికి కూడా పొన్నగంటి కూర చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం పొన్నగంటి కూరలో ఉండే ఫైబర్ వల్ల. బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.
పొన్నగంటి కూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది తద్వారా గుండె సమస్యలు తగ్గుతాయి.
పొన్నగంటి కూరను మార్కెట్లో విరివిగా కొనవచ్చు. పాలకూర తోటకూర కన్నా కూడా పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది.