రోజు రొటీన్ దోశ.. తిని బోర్ కొడితే..ఒకసారి ఈ సేమియా దోస తిని చూడండి ఇక ఎప్పటికీ వదలరు..
ముందుగా మిక్సీజార్లో ఒక కప్పు సేమ్యాను వేసి పొడి చేసుకోవాలి.
అందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా వేసి గ్రైండ్ చేసుకొని.. పక్కన గిన్నెలో తీసి పెట్టుకోండి.
ఆ గిన్నెలోనే ఒక తిన్నార క పెరుగు, సరిపడినంత నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిని పావుగంట సేపు పక్కన పెట్టేయండి. ఆ తరువాత స్టవ్ పైన పెనం పెట్టి నూనె రాసుకోండి.
నూనె వేడెక్కాక సేమ్యా దోశ మిశ్రమంతో.. పెనం పైన దోశను పలుచగా వేసుకోవాలి.
రెండు వైపులా బాగా.. క్రిస్పీగా కాల్చుకుంటే.. ఎంతో రుచికరమైన సేమియా దోశ రెడీ.