సాధారణంగా కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తుపెరగకుండా ఉంటారు. దీని వల్ల ఇబ్బందులు పడుతుంటారు.
ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం మనం తీసుకొనే ఆహారం వల్ల కూడా ఈ సమస్య బారిన పడుతామని చెబుతున్నారు.
మనం తీసుకొనే ఆహారం మనం శరీరంపైన ఎంతో ప్రభావితం చేస్తుంది. పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు ఎత్తు పెరగడంలో కొన్ని ఆహార పదార్ధాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి, ఫైబర్, ఐరన్ ఇతర పోషకాలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారు.
క్యారెట్, గుడ్డు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజు మీ పిల్లలకు ఈ రెండిటిని బ్రకే ఫాస్ట్‌లో వారికి ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
పాలు, ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది. వీటిలో లభించే పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి.
ఒమేగా- 3 కంటెట్ పదార్థాలు పిల్లలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్య రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.