ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఇసాబెల్లా ఇస్లే విస్కీ.. ఈ బాటిల్ ధర రూ.50 కోట్లు. 750 ml ఉండే ఈ బాటిల్ లో దాదాపు 15,000 చుక్కలు ఉండవచ్చు. ఈ లెక్కన చూస్తే ఒక్క చుక్క మద్యం ధర రూ.33,333. ఈ సీసాలో వజ్రాలు మరియు కెంపులు ఉన్నాయి.
ప్రపంచంలో రెండో కాస్ట్ లీ మద్యం బిలియనీర్ వోడ్కా. దీని సీసా వజ్రాలు పొదిగింది. ఒక్క మద్యం బాటిల్ ఖరీదు రూ.27.5 కోట్లు. ఒక్కో డ్రాప్ రూ.18,333 అన్న మాట.
మూడో స్థానంలో ఉన్న కాస్ట్ లీ మధ్యం టేకిలా లే. దీని సీసాలో వజ్రాలు, బంగారం మరియు ప్లాటినం కూడా ఉన్నాయి. ఒక్క బాటిల్ ధర రూ.26 కోట్లు. అంటే ఒక్క డ్రాప్ ఖరీదు రూ.17,333.
హెన్రీ 4వ మద్యం బాటిల్ కొనాలంటే రూ.15 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సీసా తయారీలో 24 క్యారెట్ల బంగారం, డైమండ్ మరియు ప్లాటినం ఉపయోగించారు. దీని ధర చూస్తే ఒక్క చుక్క మద్యం రూ.10 వేలు.
ఒక రష్యన్ బృందం 1911లో వోడ్కా రస్సోబాల్టిక్‌ని తయారు చేసింది. బాటిల్ ధర దాదాపు రూ.10 కోట్లు. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వోడ్కా. ఒక్క చుక్క మద్యం రూ.6,666 గురూ.
దివా ప్రీమియం వోడ్కా. ఒక్క బాటిల్ ధర రూ.7.5 కోట్లు. అంటే ఒక్క డ్రాప్ రేటు రూ.5 వేలు.
మెండిస్ కోకోనట్ బ్రాందీ. ఈ బ్రాందీని కొబ్బరి పువ్వుల రసం నుండి తయారు చేస్తారు. ఒక్క బాటిల్ ధర రూ.7.5 కోట్లు.